August 1, 2013
చంద్రబాబును విమర్శిస్తే సహించం : టీఎన్ఎస్ఎఫ్
ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో రాజకీయ పబ్బం
గడుపుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై కొంత మంది మంత్రులను రాష్ట్ర
ప్రభుత్వం ఉసిగొల్పుతోందని టీఎన్ఎస్ఎఫ్ ధ్వజమెత్తింది. ఇక మీదట చంద్రబాబుపై
విమర్శలు చేస్తే సహించేది లేదని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇ. ఆంజనేయగౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్
అధిష్టానం ఇప్పటికైనా రాజకీయ డ్రామాలను కట్టిబెట్టి, రాష్ట్రంలో నెలకొన్న
అనిశ్చిత పరిస్థితికి శాస్త్రీయ పద్ధతుల్లో పరిష్కారం కనుగొనాలని హితవు
పలికారు. ఆగస్ 1 నుంచి నిర్వహించ తలపెట్టిన ఫీజుల ఉద్యమాన్ని రాష్ట్రంలో
నెలకొన్న భావోద్వేగ పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకుంటున్నట్లు ఆంజనేయ
గౌడ్ తెలిపారు.
Posted by
arjun
at
5:35 AM