
మరి
కొద్దిరోజుల్లో నందమూరి బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర
చేపట్టబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్సకత్వంలో ‘జయసింహా ‘
చిత్రంలో నటిస్తున్న బాలయ్య ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే తన బస్సు యాత్ర
మొదలుపెడతారని తెలిసింది. ఇప్పటికే తన పాదయాత్ర తో తన బావ, తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రం మొత్తం దాదాపు చుట్టి వచ్చారు.
అయితే ఆయన యాత్రలో కవర్ చేయని కొన్ని జిల్లాలను బాలయ్య కవర్ చేయాలని
సంకల్పించినట్టు సమాచారం. వరుసగా పంచాయితీ, జెడ్ పి టి సి, ఎం పి టి సి,
మునిసిపాలిటీలు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రంలో
తెలుగుదేశం క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుం
దని
బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది.