July 19, 2013
అనిల్ ఏం తప్పు చేశారో బొత్స బహిర్గం చేయాలి : వర్ల
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు
బ్రదర్ అనిల్ ఏం తప్పు చేశారో పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బహిర్గతం
చేయాలని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరెంత తాగారో కాంగ్రెస్, వైసీపీ నేతలు
పరస్పరం విమర్శలు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఖద్దర్‌మాటున
కాంగ్రెస్ నేతలు గాంధీ వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని వర్లరామయ్య హితవు
పలికారు.
Posted by
arjun
at
3:24 AM