July 3, 2013
ఫలించిన తుమ్మల దీక్ష..పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు ప్రారంభం

ఖమ్మం లో పేదలకు ఇళ్ల స్థలాలు చూపాలంటూ
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన నిరవధిక
దీక్షకు ప్రభుత్వం దిగివచ్చింది. మంగళవారం ఖమ్మం ఆర్‌డీవో సంజీవరెడ్డి,
సర్వే ఎడీ ప్రభాకర్, తహసీల్దార్ అశోక్‌చక్రవర్తి దీక్ష వేదిక వద్దకు వచ్చి
ఆయనతో చర్చలు జరిపారు. పట్టాలిచ్చిన 3404 మందికి దశలవారీగా స్థలాలు
చూపించాలని, ముందుగా కొందరికైనా స్థలాలు చూపిస్తేనే దీక్ష విరమిస్తానని
తుమ్మల తేల్చి చెప్పారు. దీంతో అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీనివాస
శ్రీనరేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈలోగా ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర,
ఎమ్మెల్సీ బాలసాని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాలతోపాటు, సీపీఎం, సీపీఐ
నేతలు మంగళవారం దీక్షా శిబిరం వద్దకు చేరుకుని పట్టణ దిగ్బంధానికి
పిలుపునిచ్చారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చింది. తొలి పదిమంది
లబ్ధిదారులకు రఘునాధపాలెం 218 సర్వే వద్ద స్థలాలు చూపించారు. మరో ఇరవై
రోజుల్లోగా మిగిలిన వారికి స్థలాలు చూపిస్తామని హామీ ఇచ్చిన ఆర్డీవో
సంజీవరెడ్డి తుమ్మలకు పండ్లరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
Posted by
arjun
at
5:23 AM