June 22, 2013
దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి : రాజేంద్రప్రసాద్
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో వచ్చిన సెటిల్‌మెంట్ కథనాలతో
టీఆర్ఎస్ నేత కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని, ఏం మాట్లాడాలో తెలియక
వైసీపీ రాసిచ్చిన స్లిప్‌లు తీసుకుని మాట్లాడుతున్నారని టీడీపీ నేత
రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు మగతం ఉంటే తనపై వచ్చిన
ఆరోపణలపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ చేశారు. కేటీఆర్ నోరు అదుపులో
పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జగన్, సీఎం కిరణ్ , కేసీఆర్
రాష్ట్రాన్ని భ్ర ష్టు పట్టించారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
Posted by
arjun
at
6:29 AM