May 8, 2013
చంద్రబాబుకు ఢిల్లీలో వైద్యం.. నేడూ ఆస్పత్రికి

సుదీర్ఘ పాదయాత్ర వల్ల ఆయనకు కుడికాలు నొప్పి పెడుతోంది. ఎడమకాలి చిటికెనవేలికి కూడా గాయమైంది. నడుము నొప్పి కూడా బాధిస్తోంది. ఈమేరకు ఆయన్ను పరీక్షించిన వైద్యులు కొన్ని చికిత్సలు చేశారు. బుధవారం కూడా ఆస్పత్రికి రావాలని సూచించడంతో ఆయన హైదరాబాద్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. సాయంత్రం తాను బస చేసిన తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల తీరుపై చర్చించారు.
Posted by
arjun
at
2:16 AM