May 30, 2013
దేశంలో 'మహా' జోష్!
గెలుపుపై ధీమా
అధికారానికి దూరమైన ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిర్వేదంలోనే ఉన్నాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు సుదీర్ఘ పాద యాత్ర ప్రారంభించారు. ఆయన యాత్ర కొనసాగిన ప్రాంతాల్లో మార్పు స్పష్టంగానే కన్పించింది. ఇక మహానాడుకు వచ్చిన అనూహ్య జన స్పందన అధినేతకు ఆనందాన్ని ఇచ్చింది.
'యువ మంత్రం'
ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ చేరిక రోజే రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు మహానాడు వేదికగా యువత హృదయాలను కొల్లగొట్టేందు చేసిన ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అయిందనేది మరి కొన్ని రోజులు వేచి చూస్తేగానీ తెలియదు. చింతకాయల విజయ్, టి. వీరేంద్రగౌడ్, కింజరపు రామ్మోహన్ రావు లాంటి యువకుల సరసన కుమారుడు లోకేష్‌ను సభికుల్లో కూర్చోపెట్టడం ద్వారా విమర్శలకు బదులు చంద్రబాబు కోరుకునే ప్రచారాన్ని పుష్కలంగా పొందారు.
Posted by
arjun
at
2:04 AM