May 23, 2013
రాష్ట్రాన్ని దోచుకుంది వైఎస్ కుటుంబమే

కేవలం తండ్రి అధికారంలో ఉండగా లక్ష కోట్లు సంపాదించగా, స్వయంగా తాను గద్దెనెక్కితే రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవచ్చనే దురాలోచనతోనే పార్టీని స్థాపించి ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలతో పాటు విజయమ్మలు జగనన్న రాజ్యం వస్తుందని ప్రజలను భ్రమలో ఉంచుతున్నారని, జగనేమైనా ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేసి జైలుకెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోచుకొని జైలుకెళ్లిన జగన్ అక్కడ రాజకీయ సమావేశాలు నిర్వహించడం పట్ల ప్రభుత్వ చేతగాని తనమన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిబిఐ విచారణ ద్వారా జగన్ దోచుకున్న అస్తులు రూ.43వేల కోట్లుగా తేలిందని భవిష్యత్ విచారణలో మరిన్ని తేల నున్నాయని అన్నారు. వైఎస్‌ఆర్ దోపిడీ వల్లే గ్రామాల్లో అభివృద్ధి క్షీణించిందని, తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఖజానాను కాపాడి ‘‘వస్తున్నా మీకోసం’’ యాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు తెలుసుకొన్న హామీ లను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
తెరాస నాయకుల భాగోతాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయని, పార్లమెంట్ సభ్యుడిగా కెసిఆర్ ఏనాడూ ఏఒక్క ప్రజా సమస్యపై కూడా నోరెత్తలేదని ఎద్దేవా చేశారు.
రక్షణ స్టీల్స్‌కు వ్యతి రేకంగాపోరాడింది తెదేపానేనని, పార్లమెంట్‌లో రక్షణ స్టీల్స్‌పై చర్చ జరిగిన సమయంలో కెసిఆర్ హాజరు కాలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని అవినీతి, అక్రమాలు తెదేపా వల్లనే బయటపడ్డా యన్నారు. పార్ల మెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెడితే మొదటి ఓటు తనదే అవుతుందన్నారు.కొత్తగూడెం నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటు, కొత్త గూడెం, పాల్వంచ పురపాలక సంఘాల అభి వృద్ధి కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిన ప్రతిపాదనల సాధనకు కృషి చేయడంతో పాటు స్థానికుల హక్కును ప్రతిభింబించే ఉక్కు కర్మాగారాన్ని బయ్యారంలోనే ఏర్పాటు చేయా లన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించేలా అధి నేత చంద్రబాబుతో చర్చిస్తామన్నారు.
Posted by
arjun
at
6:30 AM