
తూ.గో: వస్తున్నా..మీకోసం పాదయాత్ర సందర్భంగా జిల్లాలో
పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విద్యుత్ సమస్యలు, కోతలకు
నిరసనగా కాకినాడలోని నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్ద ఒక్క దీక్షను
ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు వరకు దీక్ష చేయనున్నారు. బాబు దీక్షకు
భారీగా కార్యకర్తలు, స్థానికులు తరలివచ్చారు.