March 5, 2013
ఎన్టీఆర్ గడ్డపై బాబు యాత్రకు విశేష స్పందన

చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా పామర్రు రోడ్లు, ఎన్టీఆర్ సర్కిల్ తోరణాలతో పసుపు మయమయ్యాయి. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చంద్రబాబు జిందాబాద్ అంటూహల్‌చల్ చేశా రు. బహిరంగ సభ అనంతరం సదస్సులో విద్యకు సంబంధించిన పలు సమస్యలను ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన వాటి పరిష్కారానికి తగు సూచనలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపులేకపోవడం వల్ల రాష్ట్రంలో ఈ పరిస్థితు లు దాపురించాయని విమర్శించారు. చంద్రబాబుకు పూలబాట పామర్రులో ప్రవేశించే ముందునుంచి ఆయన నడిచే మార్గంలో బండి పూల బాట ఏర్పాటు చేశారు.
పలు చోట్ల మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్దారు. పార్టీ కార్యకర్తలు భారీ మోటారుసైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికి డప్పు వాయిద్యాలతో ఉత్సాహభరితంగా చంద్రబాబుతో అడుగులు కలిపారు. అనంతరం పామర్రు నుంచి బల్లిపర్రు రోడ్డు మీదు గా పెదమద్దాలి, జమీగొల్వేపల్లిల్లో సాగిన పాదయాత్ర కొమరవోలుకు చేరింది. దారి పొడవునా బాబుకు ప్రజలు తమ సమస్యలు మొర పెట్టుకున్నారు.
సర్కారు కరెంట్ బిల్లులతో కాల్చుకు తింటోందని గ్యాస్ ధర మండిస్తోందని చంద్రబాబు వద్ద మహిళలు మొరపెట్టుకున్నారు. తమ ప్రభుత్వం వస్తే కష్టాలు తీరతాయంటూ చంద్రబాబు అభయమిస్తు ముందుకు సాగారు. పామర్రులో పార్టీ కార్యాలయం ప్రారంభం పామర్రు సెంటర్‌లో టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. కార్యకర్తలు ప్రజా సమస్యలను పరిష్కరించించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా బాబు పిలుపునిచ్చారు. వర్ల రామయ్య, మండపాక శంకరబాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, పరిచూరి లాల్‌కిషోర్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:32 AM