March 11, 2013
టీడీపీ వ్యూహానికి వేదికైన కైకలూరు

అయా బస చేసిన ప్రాం తాల పేరు రాష్ట్రస్థాయిలో గుర్తుండే రీతిలో రెండుచోట్ల రాజకీయ కీలకమైన సమావేశాలు, ఒకచోట రాష్ట్ర మహిళదినోత్సవాన్ని నిర్వహించారు. 7వతేదీన చంద్రబాబు బస చేసిన దాకరంప్రాంతంలో టీడీపీ సీఎల్‌పీ సమావేశాన్ని నిర్వహించటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేతలు తరలివచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలా? వద్దా? అనే ఆంశంపై సుదీర్ఘస్థాయిలో చర్చించి, ఎట్టకేలకు తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచన విరమించుకున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన విద్యుత్‌కోత, సర్‌చార్జీల పెంపు, నిత్యావసర వస్తుల ధరల పెరుగుదలపై అసెంబ్లీలో పోరు సాగించేందుకు చంద్రబాబు దాకరంలోనే సూచనలు ఇచ్చారు. 8వతేదీన రాష్ట్ర స్థాయిలో చావలిపాడు పేరు నిలచే రీతిలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్య క్రమానికి రాష్ట్ర స్థ్ధాయి మహిళా నేతలు తరలివచ్చారు. అంతకుముం దు బస శిబిరం వద్దే గుడివాడ, పామర్రు నియోజక వర్గాల సమీక్ష సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించటం నియోజక వర్గాల కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కలిగించింది. పార్టీలో తమసమస్యలను సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడికే విన్నవించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతృప్తి కలిగినట్లు ఆనందోత్సాహాలను వ్యక్తంచేశారు. చంద్రబాబు బస చేసిన ఆలపాడులో 9వతేదీ న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల జాబితా ఖారారు పక్రియను చేపట్టేందుకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుల సమావేశాన్ని నిర్వహించడంతో ఆలపాడు గ్రామం పేరుకూ డా రాష్ట్ర స్థాయిలో వినిపించింది.
టీడీపీలో అతిర«థమహారధులు ఆలపాడుకు రావటంతో కోలహాలంగా మారింది. అక్కడే కైకలూరు, మైలవరం నియోజక వర్గాల పార్టీ సమీక్ష సమావేశాలను కూడా చంద్రబాబు నిర్వహించారు. అదే రోజు ఉప్పటేరు వరకు పాదయాత్ర సాగించి రాత్రి 8గంటలకు కృష్ణాజిల్లా వాసులకు బై..బై..చెబుతూ పశ్చిమగోదావరి జిల్లాలోకి చంద్రబాబు పాదయాత్ర ప్రవేశించింది.
Posted by
arjun
at
5:55 AM