March 26, 2013
చంద్రయాన్.. 'కౌలు' కష్టం తీరేదెప్పుడో!

"మమ్మల్నీ పట్టించుకోండి సార్!'' అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. సాగంటే సర్కారుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతుకు అందించే సాయమే అంతంతమాత్రం. ఇక కౌలుదార్లను పట్టించుకునేది ఎవరు? కరువుకో, తుఫానుకో పంట పోతే రైతుకైనా, కరువు సాయం, తుఫాను నష్టం.. మంచి ప్రభుత్వమయితే పంటపై చేసిన అప్పులకు వడ్డీ మాఫీ..ఒక్కోసారి రుణ మాఫీ కూడా జరగొచ్చు. కౌలుదారుకు ఆ భాగ్యమూ లేదు "ఎక్కడ సార్! 'నీలం'తో నిండా మునిగాం. అయినా వినేదెవరు? అప్పులకూ వడ్డీలు కట్టుకోవాలి. కౌలూ చెల్లించుకోవాలి'' అని వాపోయారు. ఇక సర్కారు చెప్పే 'గుర్తింపు' (కార్డు) ఎక్కడ?
మట్టిలోంచి తీసినట్టు ఉన్నాడు. దగ్గరకెళ్లి పలకరిస్తే మాత్రం.. మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. కుతుకులూరులో ఓ ఇటుకలబట్టీలో అతడు కలిశాడు.. అతడి కష్టం నన్ను కదిలించింది 'చదువుకుంటే ఈ కష్టం ఉండదు కదా బాబూ!'' అని అనునయించాను. "లేదుసార్! ఇంటర్ దాకా చదువుకున్నా.స్తోమత లేక ఆపేశాను'' అని చెబుతుంటే.. ఈ సర్కారు కాష్టంలో పడితేగానీ ఈ యువకులకు కష్టం తప్పదనిపించింది!
Posted by
arjun
at
10:33 PM