March 23, 2013
పదవి కోసం కాదు.. ప్రజల కోసం పాదయాత్ర

ఎర్రకొండ మీ దుగా ధవళేశ్వరం ప్రధాన రహదారిపైకి చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నాయకులు శీలంశెట్టి శ్రీనివాస్, బొబ్బా సుబ్రహ్మణ్యచౌదరి, పుక్కెళ్ల సత్తిబాబు, మెండా సోమయ్య, విన్నకోట సత్తిబాబు, అడపా శ్రీను, కె.సుబ్బారాయుడు, ఆళ్ల ఆనంద్‌రా వు తదితర నాయకులు స్వాగతం పలికారు. బొ బ్బా సుబ్రహ్మణ్యచౌదరి ఆధ్వర్యంలో కొత్తపేట సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్ వద్ద దళిత వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ తలారి మూర్తి వందమంది యువతతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నా రు. మూర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్‌స్టేషన్ సెంటర్ వద్ద చంద్రబాబు గంటపాటు ప్రసంగించారు. రెండుసార్లు కాంగ్రెస్‌ను గెలిపించిన ప్ర జలు తమ తప్పిదాన్ని గుర్తించారని మరల అటువంటి తప్పిదానికి పాల్పడవద్దని కోరారు. టీడీపీకి అధికారాన్ని అప్పగిస్తే ఐదు సంవత్సరాల కాలం లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు.
ప్రస్తుత సబ్సిడీ రేటుకే సంవత్సరానికి పది గ్యాస్ సిలిండర్లను ఇస్తామని, పుట్టిన ప్రతీ ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసాగా 25 వేల రూపాయలు బ్యాంక్‌లో జమ చేస్తామని, ఆ టో డ్రైవర్లకు వడ్డీలేని రుణాలు కల్పించి ఓనర్లుగా మారుస్తామని హామీల వర్షం కురిపించారు. చం ద్రబాబు ప్రతీ మాటకు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. తన ప్రసంగంలో కాంగ్రెస్ అవినీతిపై, వైఎస్సార్ దోపిడీపై విమర్శలు గుప్పించారు.
Posted by
arjun
at
4:16 AM