March 12, 2013
గోదావరి ఉన్నానీళ్ళకు కరువే:బాబు

వృద్ధులకు ప్రస్తుతం ఇచ్చే పింఛనును రూ.600 చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇంటి జాగాలేక ఎందరో బాధపడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటి జాగా ఇవ్వడమే గాక ఉచితంగా రూ.లక్ష ఖర్చుపెట్టి, ఇళ్ళు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి పూర్తిగా పెరిగిపోయిందన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని, పేదలందరికీ రిజర్వేషన్‌లు పెట్టి న్యాయం చేస్తామన్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చా రు. తెలుగుదేశం పార్టీ మాలలకు వ్యతిరేకమే మీ కాదని, వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత చేపడుతుందన్నారు. ప్రజలు కరెంట్ ఛార్జీలు కట్టే స్థితిలో లేరని, అయినప్పటికీ మరో రూ.18వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు.
కృష్ణా, గోదావరి బేసిన్‌లో గ్యాస్ ఉంది గానీ అది మనింటికి రాని పరిస్థితి ఉందన్నా రు. అవినీతిని పూర్తిగా నిరోదించాలని, అవినీతిపై ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పార్టీ జిల్లా అ«ధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మీ, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు బా బు, పాందువ్వ శ్రీను, స్థానిక నాయకులు వీరవల్లి చంద్రశేఖర్, పోలిశెట్టి సత్యనారాయణ (దాసు), మైలాబత్తుల ఐజక్‌బాబు, మోపిదేవి విశ్వేశ్వరరావు, పంజా నాగేశ్వరరావు, రాయపల్లి వెంకట్, నూకల అప్పాజీ, గన్నమనీడి జయప్రసాద్, చింతపల్లి మాణిక్యాలరావు, పీతల వరప్రసాద్, పోశింశెట్టి శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
10:46 PM