పోలవరం టెండర్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : తుమ్మల
ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ట్రాన్స్‌ట్రాయ్‌కు పోలవరం
టెండర్లను అప్పగించారని టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రష్యాలో విహారయాత్ర చేసి వచ్చిన ఇంజనీర్ల
బృందం నివేదిక బూటకమని ఆయన అన్నారు. పోలవరం టెండర్లలో అక్రమాలపై
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.