March 7, 2013
పులిచింతల' పూర్తి చేస్తా

కృష్ణాడెల్టాలో అధునికీకరణకు రూ.4500కోట్లను కేటాయించినట్లు ప్రకటించి,పనులు చేపట్టిన దాఖలాలు లేకుండా, నిధులు కాస్తా జేబుల్లో నిపుంకున్నారని చంద్రబాబు విమర్శించారు. కాల్వల తవ్వకాలు చేపట్ట కుండా, పంటలకు నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. మొక్కుబడిగా పనులు చేసి, బిల్లులు మార్చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రావటమే ఆధునికీకరణ పనులు నాణ్యతతో చేపట్టి, దాళ్వాపంటకు నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. విద్యుత్ పేరుతో రూ.32కోట్లమేరకు ప్రజలపై భారాన్ని మోపేందుకు నీచమైన యోచన చేస్తుందని, ఇప్పటికే రూ.14 కోట్లమేరకు సర్‌చార్జీలు పేరుతో భారాన్ని మోపారన్నారు.మరో రూ.18కోట్లమేరకు భారా న్ని వేసేందుకు ప్రభుత్వం యోచన చేస్తున్నదని బాబు ఆరోపించారు. సక్రమంగా కరంట్ ఇవ్వకపోగా, విద్యుత్ బిల్లులతో మోత మోగిస్తున్న సిగ్గులేని ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ ఆయన ధ్వజమెత్తారు.
2009లోనే నగదుబదిలీ పథకాన్ని టీడీపీనే ప్రవేశపెట్టిందని, కాంగ్రెస్ వచ్చి, నగదు బదిలీ ప«థకాన్ని నకిలీ బదిలీ పథకంగా మార్చేసారని విమర్శించారు. అధార్‌కార్డుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు యోచన చేస్తే సహించేదిలేదని, బియ్యాన్ని య«థావిధిగా పంపిణీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంతా అవినీతి పరులేనని, కొడుకు, అల్లుడు, మనవడు దోచేశారని చంద్రబాబు విమర్శించారు. అవినీతి ఆరోపణలతో చంచల్‌గూడా జైల్‌లో ఉంటున్న జగన్‌ను నమ్మితే దగా పడినట్లేనని పేర్కొన్నారు. అవినీతి ఊబిలో కురుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమిరి కోట్టాలని పిలుపునిచ్చారు.
టీడీపీ అధికారంలో రావటంతోటే తొలి సంతకం రైతు రుణమాఫీ పథకం వర్తించేందుకు, రెండో సంతకం బెల్ట్‌షాపులు రద్దు చేస్తూ చేస్తానని బాబు వెల్లడించారు. తనకు పదవులపై ఆశలేదనీ, తొమ్మిది సంవత్సరాలు సీఎంగా, తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షనాయుడిగా చేశానని, కాంగ్రెస్ దొంగల దోపీడీని చూడలేక ప్రజలకోసం వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, దేవినేని ఉమా, మాజీ మంత్రి మాగంటి బాబులు ఉన్నారు.
Posted by
arjun
at
11:04 PM