February 1, 2013
అసెంబ్లీకి వెళ్లకుండానే లక్ష కోట్లు.. అధికారానికొస్తేనో..
పంచభూతాలూ ఫలహారమే
వాళ్లొస్తే ఇంటి కప్పులూ మిగలవు!
నాసిరకం బొగ్గు కొనుగోలుతోనే కరెంటు కష్టాలు
పింఛను డబ్బుల్లోనూ సగం తిన్నారు
ఓడించి ఇంటికి పంపితేనే జన న్యాయం
పాదయాత్రలో జగన్, కిరణ్‌లపై చంద్రబాబు ధ్వజం
కిలేశపురం గ్రామంలో గౌతమ బుద్ధుడు, అల్లూరి సీతారామరాజు, మదర్ థెరెస్సా, మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ, సుభాశ్ చంద్రబోస్ వంటి మహానుభావుల వేషధారణల్లోని చిన్నారులను అభినందించారు. మహానుభావుల వేషాలు వేశారేగానీ, ఎవ్వరూ అవినీతిపరుల వేషాలు వేయలేదంటూ మెచ్చుకున్నారు. కాంగ్రెస్, వైసీపీలు ప్రజారక్షక పార్టీలు కావని, ప్రజాభక్షక పార్టీలని దుయ్యబట్టారు. జైల్లో ఉంటూనే జగన్ రాజకీయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. " తండ్రిని అడ్డంపెట్టుకుని రూ.లక్ష కోట్లు సంపాదించిన వాడికి ఓట్లేసి అధికారం అప్పగిస్తే ఏమౌవుతుందో ఆలోచించండని కోరారు.
తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇక్కడ రాష్ట్రంలో గానీ అక్కడ కేంద్రంలోగానీ ప్రజా సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగాయని చెప్పుకొచ్చారు. కిరణ్ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంటికి పోతే తప్ప రాష్ట్ర ప్రజలకు న్యా యం జరగదన్నారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్‌కు రూ.400 ఇస్తే అందులో రాష్ట్రం ప్రభుత్వం రూ.200 నొక్కేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదక కర్మాగారాలకు నాసిరకం బొగ్గు కొనుగోలు చేయడంవల్లే కరెంట్ కష్టాలొచ్చాయని ఆరోపించారు.
బాబు చెప్పిన మొసలి కథ!
పిట్టకథల రూపంలో, పామర భాషలో చంద్రబాబు.. ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం కిలేశపురం గ్రామంలో.. " వైసీపీ నేతల మొసలి కన్నీటికి కరిగి ఓటేస్తే మిమ్మల్నే తినేస్తారు'' అంటూ 'అవినీతి మొసలి' కథ వినిపించారు. "ఓ మొసలి ఏటి ఒడ్డున నోరు తెరుచుకుని కన్నీరు కారుస్తోంది.
అటుగా వచ్చిన జంతువులు అది ఎందుకలా ఏడుస్తున్నదో అర్థం కాక.. దాని దగ్గరకెళ్లి ఎందుకు ఏడుస్తున్నానని అడిగాయి. అది బాధ నటిస్తూ "నోట్లో ఎముక గుచ్చుకుంది. దాన్ని తీస్తే నా నొప్పి పోతుంద''ంటూ నమ్మబలికించింది. నమ్మిన జంతువులు ఎముక తీసేందుకు మొసలినోట్లోకి అడుగువేశాయి. అలా వేసిన దానిని వేసినట్లే మొసలి తినేసింది'' అని చెప్పారు.
Posted by
arjun
at
11:14 PM