
ప్రజల సమస్యలను
తెలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే.. దోచుకున్న డబ్బును
దాచుకునేందుకు షర్మిల పోటీ పాదయాత్ర చేస్తున్నదని సినీ నటి, తెలుగు మహిళా
నాయకురాలు కవిత అన్నారు. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆచంట సునీతతో
కలిసి గురువారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రకు ప్రజలు
నీరాజనాలు పలుకుతున్నారన్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న వారే జగన్‌ను
కలుస్తున్నారన్నారు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగల
సత్తా, సమర్ధవంతమైన నాయకత్వం ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. చంద్రబాబు
తిరిగి అధికారంలోకి వచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు