
కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం
జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ఆదుకునే పరిస్థితి కేంద్రానికి
లేదన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు.
గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను ఆదుకోవడానికి బడ్జెట్‌లో
చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు.