February 5, 2013
చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ తన ఆరోగ్యం సైతం లెక్కచేయకుండా కాలికి గాయమైనా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో రెండు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసిన దేశం నేత చంద్రబాబేనని, కాంగ్రెస్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందన్నారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, విద్యుత్ చార్జీలు భారాలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. అనంతరం దేశం నేతలు రామకృష్ణ మిషన్ హైస్కూల్‌కు వెళ్లి వాహనాలు పెట్టుకునేందుకు స్వామీజీని అనుమతి కోరగా రాజకీయ పార్టీలకు స్కూలు యాజమాన్యం అంగీకరించదని తిరస్కరించారు.
అనంతరం కొద్దిసేపు అతిథి గృహాన్ని నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేశం నేతలు జేఆర్.పుష్పరాజ్, దూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, మన్నవ సుబ్బారావు, దాసరి రాజా, సంకా బాలాజీగుప్తా, కొల్లి లక్ష్మయ్యచౌదరి, ఆరుద్ర అంకవరప్రసాద్, వల్లూరు సూరిబాబు, నందం అబద్దయ్య, ధనుంజయరావు, జంజనం సాంబశివరావు, తాడేపల్లి దేశం నేతలు కళ్లం బాపిరెడ్డి, మేకా పుల్లారెడ్డి, కొర్రపాటి రమణ, పఠాన్ ఖాశీంఖాన్, పఠాన్ జానీఖాన్, కొలనుకొండ ఏషయ్య, షేక్ రియాజ్, బెజ్జం రామకృష్ణ, కంచర్ల రంగారావు, మునగపాటి వెంకటమారుతీరావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు బస ఏర్పాట్ల పరిశీలన ఈ నెల ఆరవ తేదీ నుంచి మంగళగిరి ప్రాంతంలో వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేయనున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బస ఏర్పాట్లను టీడీపీ నేతలు ఆదివారం పరిశీలించారు. చినకాకాని ఎన్నారై మెడికల్ కళాశాల బస ఏర్పాట్లను నేతలు పరిశీలించారు. ఈ బస పరిశీలన కార్యక్రమంలో , మాజీ కౌన్సిలర్లు సంకా బాలాజీగుప్తా, కళ్లం పిచ్చియ్య, మన్నెం మార్కండేయులు, షేక్ రియాజ్, గుత్తికొండ ధనుంజయరావు, వల్లూరు సూరిబాబు, మునగాల సత్యనారాయణ, వాకా మంగారావు తదితరులు వున్నారు.
Posted by
arjun
at
5:29 AM