February 2, 2013
అవినీతిపై బాబు విల్లు

విద్యార్థులకు ఎలా చెపితే నాటుకుంటుందో అదే తరహాలో ప్రసంగిస్తున్నారు. యువతను అవినీతిపై పోరాడేలా వారిలో ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. అందుకు వారిని నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. మొన్నటి వరకు తమ్ముళ్ళూ..మీ సెల్‌ఫోన్ల నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడపండంటూ పిలుపునిచ్చిన అధినేత తాజాగా యువతకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపునిస్తున్నారు. భూగర్భ కనిజ సంపదను మొదలుకుని, భూ కేటాయింపులు, ప్రాజెక్ట్‌లు, కాంట్రాక్ట్ వర్క్‌లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు తొమ్మిదేళ్ల కాలంలో వైఎస్ హయాంలోనూ, ఇప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డి పాలనలో జరుగుతున్న అక్రమాలను చంద్రబాబు తూర్పారబడుతున్నారు. రూ.లక్ష కోట్లు సంపాదించిన జగన్ కొన్నిసీట్లులో గెలిపించినా రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించండంటూ చైతన్య తీసుకువస్తున్నారు.
Posted by
arjun
at
5:37 AM