February 8, 2013
అడుగడుగునా నీరాజనాలు

రెండో రోజు పాదయాత్రలో చంద్రబాబుకు జాతీయ రహదారిపై పనిచేస్తున్న కార్మికులతో, దారి వెంట ఉన్న వికలాంగులతో మాట్లాడారు. చినకాకాని సెంటర్‌కు చేరేసరికి గ్రామస్తులు డప్పు వాయిద్యాల నడుమ గజమాలతో చంద్రబాబును గ్రామంలో కి ఆహ్వానించారు. జాతీయ రహదారి నుంచి ఊరు పొడవునా పూల వర్షాలు కురిపించారు. స్కూలు చిన్నారుల కేరింతలతో చంద్రబాబుకు అభివాదం తెలిపారు. గ్రామంలోని కిరా ణా దుకాణదారులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. చినకాకానిలో ఏర్పాటుచేసిన ఎన్టీ ఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి ప్రసంగించారు. అనంతరం గ్రామస్తులు, కొంతమంది కార్యకర్తలు కృష్ణుని విగ్రహాన్ని, గొర్రెపిల్ల, కోనంకి గణేష్ ఈము పక్షి గుడ్డును చంద్రబాబుకు బహూకరించారు. పాదయాత్రను కొనసాగిస్తూ మార్గమధ్యలో గౌరుబోయిన కృష్ణారావు కూల్‌డ్రింకు షాపులోకి వెళ్లి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మరో ఇంటికివెళ్లి మహిళను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా వుంటున్న 90 ఏళ్ల చింకా వెంకటరత్నం అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుని 4వేల ఆర్థికసాయం అందజేశారు. హాయ్‌లాండ్ ఎదురుగావున్న కొత్తూరులో మరో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నుండి వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చంద్రబాబును కలిశారు.
చినకాకాని నుంచి బయలుదేరి కొత్తూరుకు చేరేసరికి మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు ఇచ్చి, తిలకం దిద్ధి ఘన స్వాగతం పలికారు. ముస్లిం మహిళలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అ నంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఎన్టీ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు చినకాకా ని చివరలో జాతీయ రహదారి పక్కన భోజ న విరామం తీసుకున్నారు. సాయం త్రం 4.30కు పాదయాత్ర కొనసాగించారు. జాతీయ రహదారి వెంట విజయవాడకు బస్సులో వెళ్తున్న ప్రయాణికులు చంద్రబాబుకు విజయసంకేత అభివాదాన్ని తెలిపారు. దారి పొడవునా బాబును చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాజ దళితవాడకు రావాలని ఎమ్మార్పీ ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, పట్టుబట్టి తమ కాలనీకి ఆహ్వానించారు. కాలనీలో బాబూ జగజ్జీవనరామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కాజా గ్రామంలో జెండా ఆవిష్కరించి కాసేపు ప్రసంగించారు. గ్రామమంతా మైకులహోరులతో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడవునా పూల జల్లులతో చంద్రబాబు ముందుకు సాగారు. కాజ గ్రామ సెంటర్‌లో చుట్టూ భవనాలపై కిక్కిరిసిన మహిళల మధ్య చంద్రబాబు ఎన్టీ ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బాబును కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాజ గ్రామ శివారులో టీడీపీ క్రిస్టియన్ సెల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి క్రీస్తును కొనియాడుతూ ప్రార్ధన గీతం ఆలపించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలోకాజ నుంచి నంబూరు వైపు పాదయాత్రను కొనసాగించారు.
Posted by
arjun
at
4:55 AM