February 23, 2013
ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తాడు

రైతులకు మేలు జరిగేలా స్వామినాథన్ కమిటీ సిఫారస్సులను పూర్తిస్థాయిలో అ మలు చేస్తానన్నారు. దీనివల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. తాను గతంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను అందిస్తే నేటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు గంటలు కూడా ఇవ్వటం లేదన్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ, వ్యవసా య ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించకుండా నేటి కాంగ్రెస్ ప్రభు త్వం వ్యవసాయం పండుగ అంటూ రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. అనంతరం సభకు హాజరైన అభిమానులు, కార్యకర్తలను వారి కష్టాలు అడిగి తెలుసుకున్నా రు. అనేకమంది వారి సమస్యలను బా బు ముందు ఏకరువు పెట్టారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల కారణంగా బిల్లులు కట్టలేకపోతున్నామని వాపోయారు.
డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ వడ్డీ లేని రు ణాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు లక్షకు వెయ్యి రూపాయలు చొప్పున వడ్డీ వసూలు చేస్తుందని పేర్కొన్నారు. ఇలా అనేకమంది బాబుకు వారి సమస్యలు విన్నవించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కొమ్మాలపాటి శ్రీధర్, జియావుద్దీన్, దానబోయిన శ్రీనివాసయాదవ్, మన్నవ సుబ్బారావు, చిట్టిబాబు, స్థా నిక నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:50 AM