
ప్రజల సమస్యలు
తెలుసుకొనేందుకు గత 137 రోజుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
చేస్తోన్న పాదయాత్రకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తించదని మాజీ మంత్రి
డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. శుక్రవారం చంద్రబాబు
పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుడివాడ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల
సమయంలో ఇతర జిల్లాల నాయకులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్న ఆదేశాలు
శాంతిభద్రతల సమస్య ఉన్నప్పుడే వర్తిస్తాయన్నారు. అది కూడా ఎస్‌పీ నివేధిక
ఆధారంగా ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పారు. ఇవేమి
పరిగణనలోకి తీసుకోకుండా ఊరు వదిలిపెట్టాలి అంటే అది జరిగేది కాదని స్పష్టం
చేశారు. పాదయాత్ర మానుకోవాలని, బస్సులో నుంచి రెండు రోజులు కిందకు
దిగకూడదని వంటి ఆదేశాలు వివాదాస్పదమైనవని చెప్పారు.