February 21, 2013
'దేశం' సొసైటీ ఆధ్యక్షులతో చంద్రబాబు సెట్ కాన్ఫరెన్స్

రేపు చంద్రబాబుతో సొసైటీ అధ్యక్షుల ముఖాముఖి
విజయవాడ క్యాంప్‌లో ఉన్న సొసై టీ అధ్యక్షులను శుక్రవారం ఉదయం 11 గంటల లోపు పాదయాత్రలో ఉన్న తన వద్దకు తీసుకురావాలన్నారు. అధ్యక్షులతో చర్చించి క్యాంప్‌ను ఏవిధంగా కొనసాగించాలో నిర్ణయిస్తారు. సొసైటీ అధ్యక్షులందరినీ నేరుగా చంద్రబాబు వద్దకు హాజరయ్యేవిధంగా ఏర్పాటు చేయాలని పుల్లారావుకు సూచించారు. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగిలిన ప్రాంతాల సొసైటీల అధ్యక్షులు బుధవారం రాత్రి విజయవాడ క్యాంప్‌కు వెళ్లారు.
క్యాంప్‌ను పరిశీలించిన కోడెల, ధూళిపాళ్ల, ఆలపాటి
విజయవాడలోని అలంకార్ అతిధి గృహంలో ఉన్న సొసైటీ అధ్యక్షులను, క్యాంప్‌ను మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌లు బుధవారం పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, ఆపార్టీ సీనియర్ నాయకుడు ఇక్కుర్తి సాంబశివరావు, మళ్లాయపాలెం సొసైటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ సీతారామయ్య తదితరులు క్యాంప్‌లోనే ఉన్నారు.
మంత్రి కాసుతో భేటి అయిన కొమ్మినేని అనుచరులు
సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డితో డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తోన్న కొమ్మినేని రామచంద్రరావు, ఆయన అనుచరులు భేటి అయ్యారు. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం కొమ్మినేని, నరుకుళ్లపాడు సొసైటీ అధ్యక్షుడు హరిబాబు, మాజీ ఎంపీపీ బండ్ల పున్నారావు, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, యార్డు చైర్మన్ యం వేదాద్రి తదితరులు మంత్రి కాసుతో విడివిడిగా భేటి అయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల తేదిని ఇంకా ఖరారు చేయలేదని మంత్రి కాసు తెలిపారు. ఈ దశలో అభ్యర్దుల ఎంపికపై అపుడే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదనే అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆప్‌కాబ్, మార్క్‌ఫెడ్, ఆప్కో ఎన్నికలు పూర్తయ్యే వరకు గుంటూరు డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
అంతుచిక్కని వైఎస్సార్ సీపీ వ్యూహం
డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యూహం అంతుచిక్కడం లేదు. ఏ పార్టీతో పొత్తు లేదని జిల్లా కన్వీనర్ రాజశేఖర్ ప్రకటించారు. ఇప్పటివరకు టీడీపీ, కాంగ్రెస్‌లతో పోరాడి డీసీఎంఎస్ కోసం చేతులు కలపడం మంచిది కాదనే భావన ఉంది. త్వరలో మండలాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.
ప్రత్తిపాడు, మాచర్ల స్థానాలను భారీ మెజారిటీతో గెలిచిన తన పార్టీ కాంగ్రెస్, టీడీపీలతో చేతులు కలిపేది లేదంటున్నారు. ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని చెబుతున్నారు. అయి తే ఈ నిర్ణయంపై ఎంతమంది కట్టుబడి ఉంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఆ పార్టీ బాయ్‌కాట్ చేసినా, విడిగా పోటీ చేసినా టీడీపీ సునాయాసంగా గెలుస్తుంది. టీడీపీని గెలిపించడం వైఎస్సార్ సీపీకి మింగుడుపడని అంశంగా ఉంది. మొత్తంమీద వైఎస్సార్ సీపీ వ్యవహారం అంతుచిక్కడం లేదు....
Posted by
arjun
at
5:30 AM