టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా...మీకోసం పాదయాత్రను విజయవంతం
చేయాలని.. అలాగే బుధవారం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామంలో నిర్వహించే చంద్రబాబు
బహిరంగసభకు పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి
కోనేరు సత్యనారాయణ (చిన్ని) విజ్ఞప్తి చేశారు. మంగళవారం కొత్తగూడెం ప్రెస్‌క్లబ్‌లో
ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏడు రోజుల పాటు చం ద్రబాబు
పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్ర వంద రోజులు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా
మాదిరిపురంలో విజయసూచికగా వంద అడుగులతో నిర్మించిన స్థూపాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారని,
అలాగే ఎన్‌టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని
పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. నియోజకవర్గం నుంచి 100 వాహనాలలో
వెళ్లి చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలకనున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో టీడీపీ
నాయకులు కంచర్ల గోపాలకృష్ణ, ఎస్.కె.మసూద్, రావిరాంబాబు, కుదురుపాక రాజేంద్రప్రసాద్,
గుగులోత్ కృష్ణ, పోతు పురుషోత్తం, రామ్‌చందర్ పాల్గొన్నారు.
ఎంఆర్‌పీఎస్ సంఘీభావం
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం
పాదయాత్ర మంగళ వారం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పాల్వంచ ఎంఆర్‌పీఎస్ నాయకులు
తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం పట్టణ గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీను మాట్లాడుతూ ఎస్‌సీ ఏబీసీడీ వర్గీకరణకు
చంద్రబాబు మద్దతు తెలపటంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పిలుపు
మేరకు జిల్లాలోని మాదిగలంతా పాదయాత్రకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్
పట్టణ, మండల అధ్యక్షుడు కొత్తపల్లి సోమయ్య, దాసరి ఆనందరావు, రాష్ట్ర నాయకులు గొడ్ల
మోహన్‌రావు, మిర్యాల వెంకటేశ్వర్లు, పెద్దపాక వెంకటేశ్వర్లు, గజ్జి శ్రీను, చర్ల వెంకటప్ప
య్య, యాకయ్య, బ్రహ్మం, బిక్షం, శేఖర్, జయరాజు, కె.రవి పాల్గొన్నారు.