వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలపార్టీ అని టీడీపీ అధినేత చ
ంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మూడోరోజు పాదయాత్రలో భాగంగా లోక్యాతండా, కోక్యాతండా,
నేలపట్ల, అ గ్రహారం, జీళ్లచెరువు గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో చంద్రబాబు మాట్లాడారు.
గత సీఎం వైఎస్ఆర్ తన కొడుకు జగన్‌కు లక్షకోట్లు దోచిపెట్టారనరి ఆరోపి ంచారు. గతంలో
దోచుకున్న సొమ్ముతో ఇప్పుడు మరో పార్టీ పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని
విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేదోళ్ల రక్తం తాగారని ఆరోపించా రు.
1.45లక్షల ఎకరాల గనులను అల్లుడికి ధారాదత్తంచేశారని, తనపెద్దకొడుకు గాలి జనార్దన్‌రెడ్డి
అంటూ ఓబుళాపురా న్ని అప్పనంగా అప్పగించాడని ఆరోపించారు. ఆయనేమో తన ఇళ్లలో కుర్చీలు,
కంచాలు, గిన్నెలు అన్నీ బంగారంతో చ యించుకున్నారని ఆరోపించారు. వారిని మరోసారి అధికారంలోకి
రానిస్తే ఇళ్లపై కప్పులు కూడా మిగలనీయరన్నారు. ప్ర స్తుతం కాంగ్రెస్ పాలకులు కరెంట్
ఇవ్వకపోయినా బిల్లులు గుండెలు గుబేల్ మ నేలా ఇస్తున్నారని విమర్శించారు. నాడు టీడీపీ
పాలనలో కరువు కాలంలో కూ డా నాణ్యమైన విద్యుత్ అందించి రైతుల ను ఆదుకున్నామని దీనిని
రైతులందరూ గుర్తించాలని కోరారు.
ప్రత్యేక గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు
గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం ప్ర త్యేక యూనివర్శిటీ ఏర్పాటుచేస్తామని
బాబు హామీ ఇచ్చారు. ఐటీడీఎ ద్వారా మైదాన ప్రాంతాలకు కూడా అన్ని సౌకర్యాలు కలిపిస్తామన్నారు.
గిరిజన యు వతులకు రూ.50వేలు ఇచ్చి వివాహాలు జరిపిస్తామన్నారు. అర్హులకు 1.50వేలు వెచ్చించి
ఇళ్లుకట్టిస్తామని, ఎస్‌స్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ద్వారా నిధులు వెచ్చించి తండా ల అభివృద్ధికి
పాటు పడతామన్నారు.