January 4, 2013
బాబు మా గోడు వినండి..

చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం మండలంలోని శ్రీనగర్ క్రాస్ రోడ్డు
నుంచి ప్రారంభమై కొంకపాక క్రాస్‌రోడ్, చౌటపెల్లి క్రాస్‌రోడ్, తురుకల సోమారం, జమాల్‌పురం,
గుంటూర్‌పల్లి, సోమారం క్రాస్‌రోడ్ వరకు సాగుతుం ది. ఈ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు
ఇలా వున్నాయి..
శ్రీనగర్‌లో...
- శ్రీనగర్ క్రాస్‌రోడ్ నుంచి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్లు రోడ్డు
నిర్మాణం అవసరం. దీంతో ఏనుగల్లు, చింతనెక్కొండ ప్రజలకు మండల కేంద్రానికి రావడానికి
దూరం తగ్గుతుంది.
- గామ పంచాయతీ భవనం శి«థిలావస్థకు చేరుకుంది.
- శ్రీనగర్‌లో,తండాల్లో అంతర్గత రోడ్లు,డ్రైనేజి వ్యవస్థ అధ్వానంగా వున్నాయి.
కొంకపాకలో...
- కొంకపాక క్రాస్ నుంచి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న లోలెవల్ కాజ్‌వే
వద్ద హైలెవల్ బ్రిడ్జి లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు.
- గ్రామంలోని పురాతన శివాలయం జీర్ణావస్థలో వుంది.
- కొంకపాక నుంచి గవిచర్ల వరకు రోడ్డు సరిగా లేదు.
- కొంకపాక గ్రామంలో, శివారు తండాల్లో తాగునీటి సౌకర్యం, అంతర్గత రోడ్లు,
సైడు కాల్వలు లేవు.
- గ్రామంలోని చెరువుకు వచ్చే కెనాల్ అధ్వానంగా మారింది.
- హెల్త్ సబ్ సెంటర్‌కు సరైన భవనం లేదు.
- కొంకపాక నుంచి వడ్లకొండకు రోడ్డు ఘోరంగా వుంది.
చౌటపెల్లిలో...
- చౌటపెల్లిలో,శివారు తండాలైన హట్యాతండా,లచ్చాతండా,ఎర్రగుంట తండా ల్లో
అంతర్గతరోడ్లు, తాగునీటి సౌకర్యం,డ్రైనేజి వ్యవస్థ అధ్వానంగా వున్నాయి.
- గ్రామం నుంచి ఏనుగల్లుకు వెళ్లేందుకు రోడ్ సౌకర్యం లేదు.
తురుకల సోమారంలో...
- తురుకల సోమారం చెరువులోకి ఎస్సారె స్పి నీటిని వదలడం లేదు.
- గోరుగుట్ట తండా, జగ్గుతండా, చెరువుముందు తండా, నల్లగుంట తండాల్లో రోడ్డు
సౌకర్యం, మౌళిక వసతులు లేవు.
- గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం శిధిలావస్థకు చేరింది.
జమాల్‌పురంలో...
- గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం, సైడు కాల్వలు అధ్వానంగా వున్నాయి. వీధిలైట్లు
కూడా లేవు.
- జమాల్‌పురం నుంచి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేదారిలో ఉన్న బొంది వాగుపై
హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం అవసరం.
గుంటూర్‌పల్లిలో...
-గుంటూర్ పల్లిలో సీసీరోడ్లు, వీధిలై ట్లు, సైడుకాల్వలు ఘోరంగా వున్నాయి.
- సాగునీటి కాల్వలు ఉపయోగపడ టం లేదు.
Posted by
arjun
at
12:28 AM