January 21, 2013
చంద్రబాబు యాత్రకు అపూర్వ ప్రజా స్పందన

రైతాంగ సమస్యలపై ఎంతో పట్టున్న ఆయన ఇంతకు ముందు మూడు మహానాడు కార్యక్రమాల్లో వ్యవసాయంపై మాట్లాడారు. పాదయాత్ర విశేషాలు గురించి ఆయన మాటల్లో... ? పాదయాత్ర ఎందుకు చేయాలనిపించింది జవాబు: దేశంలోనే చంద్రబాబు కీలకమైన నేత. రాష్ట్రంలో సమర్ధవంతమైన పాలన కోసం చంద్రబాబు అవసరం ఎంతో ఉంది. అవినీతిని తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన పాదయాత్ర చేస్తున్నారు.
ఆరు పదుల వయస్సులో సాహోసపేతమైన నిర్ణయం తీసుకుని అలుపెరగకుండ రేయింబవళ్లు కష్టపడుతున్న ఆయనకు ఉడుతా భక్తిగా చేతనైన సాయం చేయాలనుకుని పాదయాత్ర చేస్తున్నాను? పాదయాత్రకు స్పందన ఎలా ఉంది జవాబు: ఇప్పటి వరకు అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఎనిమిది వందలకు పైగా గ్రామాల్లో పాదయాత్ర జరిగింది. అన్ని వర్గాల ప్రజల నుంచి బాబు యాత్రకు అపూర్వ స్పందన వస్తున్నది. రాత్రి సమయాల్లో కూడా గంటల తరబడి ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. ఆడ, మగ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పాదయాత్రలో పాల్గొని బాబుకు సమస్యలు వివరిస్తున్నారు.
బాబుకు వస్తున్న స్పందన చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి ? ప్రజలు ఎక్కువగా ఏయే సమస్యలు ప్రస్తావిస్తున్నారు జవాబు: ప్రధానంగా సాగునీరు, తాగునీరు, గిట్టుబాటు ధరలు, విద్యుత్, ధరలు తదితర సమస్యలతో పాటు స్థానిక సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు ? ఆరోగ్య సమస్యలేమైనా తలెత్తాయా జవాబు: ఆదివారం నాటికి పాదయాత్ర చేపట్టి 111 రోజులైంది. ఇప్పటి వరకు ఆరోగ్యపరంగా సమస్యలు రాలేదు. ముఖ్యంగా రోజూ తేలికపాటి ఆహారం తీసుకుంటున్నాను. ఘన పదార్థం తక్కువ. ప్రజల స్పందన చూస్తుంటే ఆరోగ్యం తర్వాత ఇంకా ఎంతో హుషారు వస్తున్నది
Posted by
arjun
at
4:49 AM