January 21, 2013
ప్రియనేతకు జన దీవెన

జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రకు స్పందన వస్తుందని ఊహించని బాబు ఈ పరిణామంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. షేర్‌మహ్మద్‌పేటలో గడపగడప నుంచి తరలి వచ్చిన ప్రజానీకానికి బాబు ముగ్ధుడైపోయారు. జగ్గయ్యపేట క్రాస్ రోడ్డు దగ్గర అశేష జనవాహిని తరలి రావటంతో బహిరంగ సభలో దాదాపు గంటపాటు ఆవేశంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో ప్రజలు చవిచూస్తున్న విద్యుత్తు, నిత్యావసరాల ధరలు, బెల్టు షాపులపై ప్రభుత్వ దమన నీతిపై విరుచుకు పడ్డారు. కాం గ్రెస్ (ఐ), కాంగ్రెస్ (వై)లు ఏనాటికైనా కలిసిపోయేవని, వారి మాయమాటలకు, ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల ఒక్కరోజు సమయం తనకు కేటాయిస్తే.. ఐదేళ్లు సేవకుడిలా పనిచేస్తానని, ప్రతి కుటుంబానికి ఓ పెద్ద కొడుకులా తాను నిలబడతానని వాగ్దానం చేశారు.
Posted by
arjun
at
10:32 PM