January 16, 2013
రాష్ట్రాభివృద్ధి కోసం బాబుకు అధికారమివ్వాలి

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని, ర్రాష్టాభివృద్ధి జరగాలంటే ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించాలని దేశం జిల్లా నాయకురాల స్వర్ణకుమారి తెలిపారు. మండలంలో బాబు యాత్ర ఏర్పాట్లును పరిశీలించడానికి మంగళవారం అప్పలనర్సింహాపురం వచ్చిన ఆమె టీడీపీ నాయకుడు బండారి విశ్వనాధం ఇంట్లో జరిగిన విలేకరల సమావేశంలో మాట్లాడారు. బాబు పాదయాత్రలో రైతులకిస్తున్న రుణమాఫీ హామీకి విపరీతమైన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు పాదయాత్రలో రాజకీయాలకతీంగా ప్రజలు పాల్గొని తమ బాధలు చెప్పుకుంటున్నరని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాల గురించి ప్రజలు బాబుకు వివరిస్తున్నారన్నారు.
బాబు అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామన్న హామీకి మహిళలు బాగా స్పందిస్తున్నారన్నారు.
అవినీతిరహిత పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ప్రజలు ఆలోచించి రానున్న ఎన్నికలలో
బాబుకు అధికారం అప్పగించాలని కోరారు. పైనంపల్లిలో జరిగే సభకు భారీగా
జనం తరలిరావాలని, బాబుకు ఘ నంగా జిల్లానుంచి వీడ్కోలు పలకాలని కోరారు. సమావేశంలో ఖమ్మంరూరల్,
నేలకొండపల్లి మండలాధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నెల్లూరి భద్రయ్య, వాణిజ్యవిభాగం రాష్ట్ర
కార్యదర్శి గెల్లా జగన్మోహన్‌రావు, మండల కార్యదర్శి మైసాశంకర్, అప్పలనర్సింహాపురం
గ్రామవాఖ కార్యదర్శి బండారి రాంబాబు విశ్వనాధం, మాజీసర్పంచ్ పద్మ, భూషయ్య, నగేష్, మాజీ
ఎంపీపీ తీగ వెంకటేశ్వర్ల, తెలుగుయువతనాయుకడు మల్లిఖార్జునరావుపాల్గొన్నారు.
Posted by
arjun
at
5:27 AM