January 16, 2013
దేశ భవిష్యత్ మీ చేతుల్లోనే

చంద్రబాబు:- పిల్లలు బాగున్నారా.. ఏంటి విశేషాలు..
అఖిల:- సార్ ధరలు విపరీతంగా పెరిగాయ్ విద్యుత్ కోత అధికమయ్యింది.. పేదలు
రైతులు ఇబ్బందులు పడుతున్నారు దీనికి ఏమిటి పరిష్కారం.?
బాబు:- చేతకాని ప్రభుత్వాలను ఎన్నుకోబట్టే ఇన్ని బాధలు వచ్చాయి తల్లీ..
టీచర్ పనికి రాని వాడైతే విద్యార్థులు కూ డా పాడవుతారు..పాలకుడు పనికి రాని వాడైతే
ప్రజలకు ఇలాంటి బాధలు తప్పవు.. నేనున్నప్పుడు ధరల స్థిరీకరణకు వి ద్యుత్ మిగులుకు ప్రాధాన్యం
ఇచ్చా.. కా నీ ఈప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చే యటం వల్లే సమస్యలకు కారణం..
గౌతమి:- సార్ ఢిల్లీలో ఒక యువతిపై అత్యాచారం జరిగింది..దేశంలో యువతులకు
రక్షణ లేకుండా పోయింది.. మీ రు అధికారంలోకి వచ్చాక వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడతారు..
బాబు:- అత్యాచారానికి పాల్పడిన వా ళ్లకు ఉరి శిక్ష వేస్తే మరెవరూ ఆతరహా
దుశ్చర్యకు పాల్పడకుండా బుద్ధొచ్చేది..కానీ ఈప్రభుత్వం ఆపని చేయలేదు. నేను అధికారంలో
ఉన్నప్పుడు మహి ళల రక్షణకు, వారి అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇచ్చా.. విద్యా ఉద్యోగాల్లో
రిజర్వేషన్లు అమలు చేశా.. పోలీస్ , ఆర్టీసీల్లో మహిళల నియామకం నాహయంలోనే జరిగింది..
నవ్య :- అనా«థలు చదువుకునేలా
మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు..
బాబు:- బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కు నేను అనాడే చర్యలు చేపట్టాను..
ఇందుకు మీజిల్లాలో లోక్యా తండాలో విద్యార్థినే ఉదాహరణ.. అనా«థలకే కా దు పదిహేనేళ్లలోపు పిల్లలందరూ చదువుకునేందుకు
సైకిళ్లు, ల్యాప్ టాప్‌లు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తా..
రైతు, కూలీ మేలు కోరి..
బాబు పొలం బాట
రైతులు వ్యవసాయ కూలీల యోగ క్షేమాలను చంద్రబాబు తెలసుకున్నారు.పాదయాత్ర
మధ్యలో మిర్చి, వరి పొలాలకు వెళ్ళి రైతులు కూలీల సమస్యలు తె లుసుకున్నారు.. బాణాపురం
సమీపం లో బాబు మిర్చి తోటకు వెళ్లి రైతుతో మాట్లాడారు పంటకు పెట్టిన పెట్టుబడి దిగుబడి
ధరల గురించి ఆరా తీశారు.. అనంతరం వరి నాట్లు వేస్తున్న కూలీల ను ఆప్యాయంగా పలకరించారు..
వి ద్యుత్ కోతలు తమ ఉపాధికి కూడా చే టు కలిగిస్తున్నాయని కూలీలు బాబుకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి ఇబ్బందులు తీరుస్తానని హామీ ఇచ్చారు
విద్యుత్ కోతలపై వింత నిరసన
విద్యుత్ కోతలపై కమలాపురం గ్రామ వాసులు విన్నూత్న నిరసన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించారు.. చంద్రబాబు పాదయాత్ర దారిలో ట్యూబ్ లైట్లు,
బల్పులు, ఫ్యాన్లు చేబూని కరెంటు కోతలను నిరసన వ్య క్తం చేశారు. ఈసందర్భంగా చంద్రబా
బు వారి వద్దకు వెళ్లి పలకరించారు.. టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు ఓపిక పట్టాలని వారిని
సముదాయించారు..
ఉన్న కార్డు తొలగించారు..
బాబు పాదాలపై పడిన మహిళ
'మా అత్త పేరున మా కుటుంబ సభ్యులందరం రేషన్ కార్డు పొందాం.. ఆమె ఇటీవల
చనిపోయింది.. దీంతో మా తెల్ల రేషన్ కార్డును అధికారులు తొలగించారు. అదేమని అడిగితే
రేషన్ కార్డుగల ఆమె చనిపోయింది. అందుకే కొట్టేశామని డీలర్ చెపుతున్నాడు..నాభర్తకు చూపు
సరిగా కనిపించక పనికి కూడా పోవటంలేదు.. కుటుంబాన్ని పోషించటం భారం అవుతోంది.. మా సమస్య
మీరే తీర్చాలి అంటూ'' అయ్యగారి పల్లి కాలనీకి చెందిన మహిళ కుక్కల సుశీల చంద్రబాబు కాళ్లమీద
పడింది.. అధికారులతో మాట్లాడి ఈమె సమస్య తీ ర్చండి అంటూ చంద్రబాబు స్థానిక నేతలకు సూచించారు
కొడుకును కోల్పోయాం..
ఆదుకో అన్నా..
ఒక్కగానొక్క కొడుకు రైలు కింద పడి ఆ త్మహత్య చేసుకున్నాడు.. వృద్ధాప్యంలో
మమ్మల్ని ఆదుకుంటాడని ఆశపడితే ఆధారం లేకుండా అయ్యింది.. మాకు ఏ దైనా సాయం చేసి పుణ్యం
కట్టుకో చం ద్రన్నా అంటూ గంధసిరికి చెందిన దం పతులు చంద్రబాబుతో చెప్పుకొని విలపించారు.
టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని విధాలా ఆదుకుంటామని చంద్ర బాబు హామీ ఇచ్చారు.
Posted by
arjun
at
5:10 AM