January 3, 2013
9 నాటికి యాత్రకు వంద రోజులు!

పాదయాత్ర వంద రోజులకు చేరుకున్న సందర్భాన్ని స్ఫురింపచేస్తూ రాష్ట్రమంతటా
వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికోసం ఎక్కడికక్కడ
స్థానిక నేతలు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు.. ఈ నెల
11న పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కాగా.. 'పల్లె పల్లెకూ
తెలుగుదేశం' నిర్వహణలో వెనకబడి పోయిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులను పిలిపించి
మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. సుమారు వంద నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చురుకుగా
సాగడం లేదని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆయనకు నివేదించింది.
Posted by
arjun
at
4:56 AM