December 13, 2012
ఆదిలాబాద్ జిల్లాలో తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

అయితే గత ఉప ఎన్నికల్లో పాయల శంకర్ పోటీ చేసి ఓట మి పాలైన అప్పటి నుంచి పార్టీ పటిష్టత కోసం తీవ్ర కృషి చేశారు. అయితే బాబు పాదయాత్రలో అక్కడక్కడ నియోజక వర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశా రు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ము థోల్ నియోజక వర్గ, నిర్మల్ నియోజక వర్గంలలో పాదయాత్ర కొనసాగినా అక్కడ స్పష్టమైన అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదు. బుధవారం మా త్రం మూఠాపూర్ వద్ద జరిగిన ఆదిలాబాద్ నియోజక వర్గ సమీక్షా సమావేశంలో ఆదిలాబాద్ అభ్యర్థిగా పా యల శంకర్ పేరును చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆదిలాబాద్ నియోజక వర్గ టీడీపీ కార్యకర్తలు, ము ఖ్య నాయకులు పాయల శంకర్ పేరు ఖరారు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
టీడీపీతోనే ప్రజల కష్టాలు దూరం: ఈ సందర్భంగా పాయల శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని అన్నారు. రైతులు, మహిళలు టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. మధ్యంతర ఎన్నికలే గానీ, 2014లో జరిగే ఎన్నికలు గానీ వస్తే పార్టీ అఖండ విజ యం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో లక్షెటిపేట్ మార్కెట్ మాజీ చైర్మన్ సల్ల నాగభూషణ్, జిల్లా ఉపాధ్యక్షులు దిమ్మ సం తోష్, మాజీ ఎంపీపీ ఫణింధర్‌రావు, రాష్ట్ర రైతు కార్యదర్శి భూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
1:00 AM