December 15, 2012
బాబుకు ఘన స్వాగతం

వేద పండితులు అర్చకులు మంత్రోచ్ఛారణలు చేస్తూ పూర్ణకుంభ స్వాగతం పలికి జిల్లాలోకి ఆహ్వానించారు. డప్పువాయిద్యాలు, మంగళహారతులతో బాబును ఊరేగింపుగా ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి సు మారు అరకిలో మీటరు దూరం గల ఒబులాపూర్ వరకు బాబు పాదయా త్ర జరిపారు. టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు, అనుబంధ సంఘాల నా యకులు, కార్యకర్తలు జేజేలు పలుకుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. దారిపొడవునా పాటలు పాడుతూ...నృత్యాలు చేస్తూ పాదయాత్రలో కార్యకర్తలు హుషారుగా గడిపారు. చంద్రబాబు నాయుడు నాయకులు, కార్యకర్తలకు అభివాదాలు చేస్తూ పాదయా త్ర జరిపారు.
కార్యక్రమంలో ముద్దసాని కశ్యప్‌రెడ్డి, బుగ్గారం మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, టీడీపీ నాయకులు, టీడీపీ వేములవాడ ని యోజకవర్గ నాయకురాలు గండ్ర నళి ని, రమేశ్, రవీందర్ రావు, సాంబారి ప్రభాకర్, రఫీ, ఆర్మూర్ కిష్ట య్య, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
ఒబులాపూర్‌లో రాత్రి బస....మల్లాపూర్ మండలంలోని ఒబులాపూర్‌లో టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు రాత్రి బసకు వచ్చారు. గ్రామ పంచాయతీ శివారులో గల మై దానంలో టీడీపీ నాయకులు బాబు బసకు ఏర్పాట్లు చేశారు.
మైదానంలో ఏర్పరిచిన ప్రత్యేక వాహనంలో చంద్రబాబు రాత్రి బస జరిపారు. మారుమూల మండలంలోని అటవీ ప్రాం తంలో గోదావరి సమీపాన చంద్రబా బు నాయకుడు రాత్రి బస చేయడం విశేషం. రాత్రి బసకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీందర్ ఆద్వర్యంలో జగిత్యాల ఏఎస్పీ రమారాజేశ్వరీ, సీఐ దేవందర్ రెడ్డిల పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేశారు
Posted by
arjun
at
5:52 AM