December 31, 2012
కాకతీయ ఉత్సవాలపై నిర్లక్ష్యం తగదు

భారీగా నిర్వహించాల్సింది..
కాకతీయుల సామ్రాజ్యం ఎంతో చారిత్రాత్మకమైనదని, అప్పుడు వేయి స్తంభాలగుడి,
కోట గుళ్లు, రామప్ప దేవాలయం లాంటి అద్భుత కట్టడాలు నిర్మించారని, అలాంటి వారి చరిత్రను
స్మరిస్తూ భారీగా నిర్వహించాల్సిన ఉత్సవాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కోటి
రూపాయలు కేటాయిస్తామని చెప్పి, కేవలం రూ.45 లక్షలే కేటాయించిందన్నారు. టీడీపీ అధికారంలోకి
వ చ్చిన వెం టనే ఘనంగా నిర్వహిస్తామన్నారు.
అదో బ్లాక్‌మెయిలింగ్ పార్టీ
టీఆర్ఎస్ నీతి లేని పార్టీ అని, అదో బ్లాక్‌మెయిలింగ్ పార్టీ అని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ స్వార్థం తప్ప ఆ పార్టీకి ప్రజా సమస్యలు పట్టవన్నారు. తెలంగాణపైన
2008లో స్పష్టమైన వైఖరి వెల్లడించామ ని, అదే లేఖను తిరిగి అఖిలపక్షంలో ఇవ్వడం జరిగిందని
పేర్కొన్నారు. రాష్ట్రంలో అసమర్థ ముఖ్యమంత్రి మూలంగా అభివృద్ధికి నోచుకోవడం లేదని,
1.50లక్షల కోట్ల వార్షికాదాయం ఉన్నప్పటికి ఆ నిధులు ఎటు వెళుతున్నాయో అర్థం కాకుండా
ఉందన్నారు.
వైఎస్ఆర్.. హత్యా రాజకీయాలు
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక హత్యా రాజకీయాలు పెరిగాయని, అనంతపురంలో
పరిటాల రవిని పార్టీ కార్యాలయంలోనే హత్య చేశారని ఆరోపించారు. జైలుకు వెళితే జైలులోనూ
హత్యలు జరిగాయని, జైలు నుం చే అన్ని జరిపించారని, ఇలాంటి నేతలతో రా జకీయాలు భ్రష్టు
పట్టాయన్నారు. వైఎస్సా ర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కుమారుడికి లక్షల కోట్ల
రూపాయలు సంపాదించి పె ట్టాడని ఆరోపించారు.
రైతులను ఆదుకుంటా..
రైతులు కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే
రుణమాఫీ చేస్తామని, 9గంటలపాటు ఉచిత వి ద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదు లాఠీదెబ్బలు
తింటే ఒక్క యూరియా బస్తా లభించే పరిస్థితి నెలకొందని, లాటరీ తీస్తే లక్కు తగిలితే పత్తివిత్తనాల
బస్తా దొరికే దుస్థి తి ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు.
మహిళలు ఎదగాలి
మహిళలు ఆర్థికంగా ఎదగాలని, తాను డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి గ్యాస్,
పావులావడ్డీ రుణాలు అందించానని, బాలికల అభివృద్ధికి బాలికా సంరక్షణ పథకం కింద రూ.5
వేలు బ్యాంకుల్లో వేశామన్నారు. విద్యార్థినులకు సైకిళ్లు అందించానని, ఇవన్నీ ఇప్పుడు
పోయాయని, బ్యాంకుల్లో మహిళలకు రుణా లు ఇవ్వడం లేదన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఒక
ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు.
ఐఏఎస్‌కు రెండు.. టీచర్‌కు నాలుగు..
ఐఏఎస్‌కు రెండు పరీక్షలు రాయాల్సి వస్తే ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు నాలుగు
పరీక్షలు రాయాల్సి వస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే టెట్ రద్దు చేసి, ఎస్‌జీటీ
ఉపాధ్యా య ఉద్యోగాలు ఇస్తామన్నారు. చదువుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చే
స్తామని, పరకాల లాంటి ప్రాంతాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలు చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు
చేస్తామన్నారు. ఉద్యోగం, ఉపాధి లభించే వర కు నిరుద్యోగులకు భృతి ఇస్తామని తెలిపారు.
అధికారంలోకి వస్తే..
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని, వృద్ధులు, వికలాంగులకు
పింఛన్‌లు పెంచి ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు లాభసాటిగా వ్యవసాయం జరిగే విధంగా
చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. అయితే ఎన్నికలు జరిగే ఒక్కరోజు తనకు ఇవ్వాలని,
ఆ రోజు ప్రలోభాలకు లొంగకుండా, డబ్బులకు ఆశ ప డకుండా టీడీపీకి ఓటేసి గెలిపిస్తే ఐదేళ్లు
మీ సేవకుడిగా సేవ చేస్తానని పేర్కొన్నారు. తన పాదయాత్ర స్వా ర్థంతో రాజకీయం కోసం చేయడం
లేదని, 30ఏళ్లు టీడీపీని ఆదరించిన పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో, వారి కష్టాల్లో
పాలు పంచుకోవాల నే ఉద్దేశంతో నేరుగా పాదయాత్ర ద్వా రా ప్రజల వద్దకు వెళుతున్నానని,
తన ది ధర్మ పోరాటమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు,
ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, ఎంపీ గుండు సుధారాణి, నియోజకవర్గ ఇన్‌చార్జి
గండ్ర సత్యనారాయణరావు, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:29 AM