October 7, 2013
ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేదా?
పిసిసి అధ్యక్షుడు బొత్స సత ్యనారాయణ ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి
ప్రజలపై లేదా? అని దిగ్విజయ్‌ను... తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ
మంత్రి సోమిరెడ్డి చంద్రమో హన్‌రెడ్డి ప్రశ్నించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై
ఆయన ఘాటుగా స్పందించారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బెల్టుషాపులు, మద్యం
షాపులు, కబ్జాలు, మాఫియాలు నడుపుతున్న బొత్స, ఆయన కుటుంబీకుల ఆగడాలకు,
ఆరాచకాలకు విసిగిన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అయితే ఈ దాడులను
తాము సమర్థించడం లేదని, కానీ దిగ్విజయ్‌సింగ్‌కు మాత్రం బొత్స ఆస్తులపై
ఉన్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేనట్లుగా ఉందన్నారు. 65 రోజులుగా సీమాంధ్రలో
ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా.. ఒక్క కాంగ్రెస్ నేత కూడా సానుకూలంగా
వ్యవహరించలేదన్నారు. దిగ్విజయ్‌కి కూడా ఇక్కడి ప్రజలు గుర్తుకు ఉరాలేదా?
అని ప్రశ్నించారు. ఇంతటి తాగ్యాల ఉద్యమం చరిత్రలో మరొకటి లేదని
వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్షపై దిగ్విజయ్ ప్రశ్నించడంపైనా ఆయన
స్పందించారు. విభజన ప్రక్రియ అసంబద్ధంగా ఉందనే చంద్రబాబు దీక్ష
చేస్తున్నారన్నారు. అయినా చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో మీ
ముఖ్యమంత్రి(కిరణ్), మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను అడుగు
అంటూ.. దిగ్విజయ్‌కు... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు.
Posted by
arjun
at
12:09 AM