October 5, 2013
కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్ వచ్చింది
కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్
వచ్చిందని చర్చలో పాల్గొన్న టిడిపి ఎంపి శివ ప్రసాద్ విమర్శించారు. విభజన
విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించుకుందని చెప్పారు. దాని
ప్రకారమే అటు తెలంగాణలో టిఆర్ఎస్ ను, ఇటు సీమాంధ్రలో వైసిపి ని కలుపుకునే
పనిలో పడిందిని చెప్పారు. గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి
వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ సీమాంధ్రలో తన అస్తిత్వం కోల్పోయిందని
తెలుస్తుందని అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి
అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలవడం వెనుక రాజకీయకారణాలేమీ లేవని
చెప్పారు. వక్రమార్గాల ద్వారా జగన్ బెయిల్ పై బయటికి వచ్చారని
విమర్శించారు. ఇప్పుడు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వైసిపి స్టాండ్
తీసుకోగలదా అని ప్రశ్నించారు.
Posted by
arjun
at
6:54 AM