కాంగ్రెస్, వైసీపీ కుమ్మక్కై జగన్ అక్రమాస్తుల కేసును
నీరుగారుస్తున్నాయని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. మంగళవారం ఉదయం జగన్
అక్రమాస్తుల కేసును వేగవంతం చేయాలని కోరుతూ సీవీసీతో టీడీపీ ఎంపీలు నామా
నాగేశ్వరరావు, కొణకళ్ల, రమేష్‌రాథోడ్, సీఎం రమేష్ భేటీ అయ్యారు. అనంతరం
వారు మీడియాతో మాట్లాడుతూ ఆరు దేశాల్లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు
రుజువైందని, అయినా ఈడీ సరిగా దర్యాప్తు జరపడం లేదని మండిపడ్డారు. రూ.45
కోట్లు అవనీతి జరిగినట్లు నిర్థారణ అయితే రూ.270 కోట్ల ఆస్తులను మాత్రమే
జప్తు చేశారని టీడీపీ ఎంపీలు విమర్శించారు.