September 6, 2013
సీమాంధ్ర ఉద్యమం కెసిఆర్ పుణ్యమే!: మోత్కుపల్లి
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్
పదేపదే చేసిన రెచ్చగొట్టుడు వ్యాఖ్యల వల్లే సీమాంధ్రలో ప్రస్తుత ఉద్యమం
వచ్చిందని, ఆ పుణ్యం ఆయనదేనని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత,
తెలంగాణ ప్రాంత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. గురువారం
ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
జయంతి సభలో ఆయన మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం
ఒక్కటే టిఆర్ఎస్ లక్ష్యమని, తెలంగాణ కోసం మంచి చేసినా ఆ పార్టీకి పట్టడం
లేదని ఆయన వ్యాఖ్యానించారు. 'తమ పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టి టిడిపి
అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ కోసం లేఖ ఇచ్చారు. ఆ లేఖకు టిఆర్ఎస్
ఇచ్చిన గౌరవం ఏమిటి? కనీసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఆ పార్టీకి
నోరు రాలేదు. తెలంగాణ ఇస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకొన్న
తర్వాత సోనియాను కలిసి ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం కూడా కెసిఆర్ చేయలేదు.
తన కుటుంబ లాభం, స్వార్ధం తప్ప ఆయనకు మరేది పట్టదు' అని మోత్కుపల్లి
ఆరోపించారు.
Posted by
arjun
at
5:09 AM