September 7, 2013
గుంటూరు జిల్లాలో ముగిసిన చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర
చంద్రబాబు యాత్రను అడ్డుకోవాల ని వైసీపీ పిలుపునివ్వడం, ఆయన్ని ప్ర శ్నించాలని ఏపీఎన్‌జీవోల ఇచ్చిన పిలు పు మధ్యన గురజాల నియోజకవర్గం పొందుగల నుంచి టీడీపీ అధినేత యా త్రకు శ్రీకారం చుట్టారు. ఆత్మగౌరవ యాత్ర చేయాలన్న నిర్ణయం తీసుకొన్న తర్వాత కేవలం నాలుగు రోజుల వ్యవ ధే అయినప్పటికీ నేతలంతా సమష్టిగా కదిలారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జేఆర్ పుష్పరాజ్, ఆలపాటి రా జేంద్రప్రసాద్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాడికొండ ఇన్‌చార్జ్ తెనాలి శ్రావణ్‌కుమార్, సత్తెనపల్లి ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ, మంగళగిరి ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాసరావు భారీ ఎత్తున పార్టీ కేడర్‌ను సమీకరించారు. వీరికి తెలుగుదేశం నగర కమిటీ, తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగుమహిళలు జోడు కావడంతో యాత్రకు విశేష స్పందన ల భించింది. తొలి రోజున పొందుగల, దా చేపల్లి, పిడుగురాళ్లలో జరిగిన సభలు హైలెట్‌గా నిలిచాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరిలో జరిగిన యాత్రకు జనం విశేషంగా స్పందించారు.
చంద్రబాబు రాక కోసం మండుటెండలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూ డా నిరీక్షించడం విశేషం. కొన్ని గ్రామా ల్లో చంద్రబాబును పట్టుబట్టి మరీ ఎన్‌టీఆర్ విగ్రహాలు, పార్టీ జెండాల వద్దకు తీసుకెళ్లి ఆవిష్కరింప చేశారు.
వైసీపీ ఒకటి, రెండు చోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడగా పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. వైసీపీ నేతలకు చంద్రబాబుతో పాటు గురజాల ఎ మ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీ వ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. యాత్రలో ప్రధానంగా తెలుగుజాతి వి చ్ఛిన్నానికి కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి సంయుక్తంగా కుట్ర పన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌ను విలీనం చేసుకొని అక్కడ సీట్లు పొందాలి. ఇక్కడ ఓడిపోయినా జగన్ మాస్కుతో సీట్లు దక్కించుకోవాలి. ఇది కాంగ్రెస్ కుటిల నీతి అంటూ ఎండగట్టారు. నాడు ఎన్‌టీఆర్
పార్టీని స్థాపించి తెలుగుజాతికి ఆత్మగౌరవం తీసుకొస్తే తాను హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపి ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలు కల్పించానని చెప్పారు. రూపాయి పతనం కావడం, బొగ్గు కుంభకోణంలో ఫైళ్లు మాయం కావడం, సోనియాకు డబ్బు పిచ్చి పట్టిందని, మన్మోహన్ ఒక తోలుబొమ్మలా మారాడని, జగన్ దొంగబ్బాయి, రాహుల్ మొద్దబ్బాయి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆరు రోజుల పాటు ఐదు నియోజకవర్గాల్లో 50కి పైగా గ్రామాలు 240 కిలోమీటర్ల పొడవునా యాత్ర కొనసాగింది. జిల్లాలో చివరిగా ఉండవల్లి సెంటర్‌లో ప్రసంగించిన చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ మీదగా విజయవాడ నగరంలోకి వెళ్లారు. బ్యారేజ్ వద్ద టీడీపీ జిల్లా నేతలు, కార్యకర్తలను చంద్రబాబు అభినందించారు.
Posted by
arjun
at
8:00 AM