September 16, 2013
ఇతర ఆస్తులు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే అందులో వారికి ఆస్తుల్లో పెర్సంటేజ్ ఇస్తా
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలను సోమవారం తన
నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు ఆస్తుల విలువ
రూ. 42.06 లక్షలు, భువేశ్వరీ (భార్య) ఆస్తుల విలువ రూ. 3305.02 లక్షలు,
లోకేష్ నాయుడు (కుమారుడు) ఆస్తుల విలువ రూ. 492.53 లక్షలు, బ్రహ్మణి
(కోడలు) ఆస్తుల విలువ రూ. 330.69 లక్షలు ఉన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
1992లో స్థాపించిన హెచిటేజ్ కంపెనీ పూర్తి పారదర్శకంగా ఉందనిఆయన తెలిపారు.
గత 22 సంవత్సరాలుగా కంపెనీ ఓ పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు
స్పష్టం చేశారు. హెరిటేజ్ కంపెనీ ఈ ఏడాది 30 శాతం డివిడెండ్ చెల్లించినట్లు
ఆయన తెలిపారు. తాను ప్రకటించినవి కాకుండా ఇంకా ఎలాంటి ఇతర ఆస్తులు
ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే అందులో వారికి ఆస్తుల్లో పెర్సంటేజ్ ఇస్తానని
చంద్రబాబు సవాల్ చేశారు. సింగపూర్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని ఆయన
స్పష్టం చేశారు.
Posted by
arjun
at
3:00 AM