August 10, 2013
తెలంగాణ, సీమాంధ్రలో రెండు చోట్ల టీడీపీ అధికారంలోకి : యనమల
హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి గట్టి పట్టు ఉందని ఆ పార్టీ నేత, మండలి
ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ పట్ల తెలంగాణ ప్రజల్లో
ఆత్మీయతా, అభిమానం ఉందన్నారు. కాంగ్రెస్‌పై సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత
ఉందని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలమేమిటో తేలిపోయిందని ఆయన
తెలిపారు. సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందన్న భయంతో కాంగ్రెస్ ఉందన్నారు.
భవిష్యత్‌లో వైకాపా ఉండదన్నారు. కాంగ్రెస్‌లో కలువడం ఖాయమని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ గెలువదు కనుక సీమాంధ్రలో వైకాపాను అడ్డు పెట్టుకొని లబ్ధి
పొందాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో రెండు
చోట్ల టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Posted by
arjun
at
9:16 AM