
సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు
శోభాహైమావతి చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు గురువారం భగ్నం చేశారు.
దీక్షా స్థలిని నుంచి ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. కాగా దీక్ష
శిబిరానికి మళ్లీ వెళ్లేందుకు శోభాహైమావతి యత్నిస్తున్నారు. సమైక్యాంధ్ర
కోసం గత నాలుగు రోజులుగా శోభా హైమావతి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆమె
ఆరోగ్యం క్షీణించిడంతో పోలీసులు దీక్ష భగ్నం చేశారు.