August 8, 2013
రాజ్యసభ లో పడిపోయిన సి.ఎమ్.రమేష్
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభ జరుగుతున్న సమయంలో పడిపోవడం
కొంతసేపు కలకలం ఏర్పడింది. సేవ్ ఆంధ్రప్రదేశ్, వి వాంట్ జస్టిస్ అంటూ
గత కొద్ది రోజులుగా రాజ్యసభలో ఆందోళన చేస్తున్న ఆయన ఈరోజు సభ జరుగుతుండగా
స్పృహ తప్పిపడిపోయారు. దీనిని గమనించిన రాజ్యసభ ఉపాధ్యక్షుడు
పి.జె.కురియన్ సభను 10 నిమిషాలు సేపు వాయిదా వేశారు. సీఎం రమేష్ ను
చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు.ఆ తర్వాత కోలుకున్న రమేష్ తమ
ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు.
Posted by
arjun
at
5:41 AM