July 10, 2013
దేశం గెలుపుతోనే రాజకీయాల్లో మార్పు
తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే దేశ, రాష్ట్ర
రాజకీయాల్లో మా ర్పు వస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తుమ్మల
నాగేశ్వరరావు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కేం ద్రంలో
జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం మినహా మిగిలిన కాంగ్రెసేతర
ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించిందని
గుర్తుచేశారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం ప్రజలకు సుపారిపాలన అందించిందన్నారు.
మంగళవారం ఎన్టీఆర్‌భవన్‌లో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేషనల్ ఫ్రం ట్, యునైటేడ్‌ఫ్రంట్
ప్రభుత్వాల ఏర్పాటులో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీరామారావు,
ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు కీలకపాత్ర పోషించారని తుమ్మల గుర్తు చేశారు.
పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కీ, ఆ పార్టీలో విలీనమయ్యే వైస్సార్సీపీ,
టీఆర్ఎస్‌లకు ఓటు వేయవద్దని కోరారు. మైరుగైన పాలన కోసం టీడీపీ బలపర్చిన
అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Posted by
arjun
at
5:53 AM