July 21, 2013
అఖిలేష్ మంచి మిత్రుడు : తలసాని
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే ష్ యాదవ్ తనకు మంచి
మిత్రుడని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ చాలా
బాగుందని అఖిలేష్ చెప్పారని, టీడీపీ హాయంలోనే అభివృద్ధి జరిగిందని తాను
చెప్పినట్లు తలసాని తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభలో పాల్గొనడానికై
నగరానికి వచ్చిన అఖిలేష్ మారేడ్ పల్లిలోని తలసాని శ్రీనివాస్ నివాసానికి
వెళ్లి ఆయనతో 15నిమిషాలపాటు సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి అఖిలేష్
మహాసభకు బయలుదేరి వెళ్లారు.
Posted by
arjun
at
2:43 AM