July 12, 2013
కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం : చంద్రబాబు
తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న చర్చలు, పరిణామాలు కాంగ్రెస్ పార్టీ
అంతర్గత వ్యవహారమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం
ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం దిశగా జరుగుతున్న
పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అది కాంగ్రెస్ పార్టీ
అంతర్గత వ్యవహారమని, దానిపై తాము స్పందించబోమని అన్నారు. ‘ఈ అంశంపై మా
వైఖరిని ఇప్పటికే చెప్పాం. మహానాడులో కూడా తీర్మానం చేశాం. కేంద్రానికి
లేఖలు ఇచ్చాం. అఖిలపక్ష సమావేశంలో కూడా పార్టీ వైఖరి తెలియజేశాం. మా
స్టాండ్ స్పష్టం చేశాం. వాళ్లు ఏం చేస్తారో చేయనివ్వండి’ అని
వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తారా?
అన్న ప్రశ్నకు నిర్ణయం రానివ్వండి అంటూ దాటవేశారు.
Posted by
arjun
at
7:45 AM