హైదరాబాద్ : నెల్లూరు కలెక్టర్‌గా పని చేసిన కేవీపీ బంధువు నాలుగేళ్లలో
రూ.300 కోట్లు సంపాదించారని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. కృష్ణపట్నం
భూ ఆక్రమణను జగన్ కేసులో భాగంగా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.
సహజ వనరులను ఓ కుటుంబానికి ధారదత్తం చేసే అధికారం వైఎస్‌కు ఎవరిచ్చారని ఆయన
ప్రశ్నించారు.