హైదరాబాద్ : రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ టీడీపీను టార్గెట్ చేశారని
టీటీడీపీ కన్వీనర్ ఎర్రెబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఉద్యమాన్ని
పక్కనబెట్టి కేసీఆర్‌రాజకీయ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. టీఆర్‌ఎస్
రాజకీయ దోపిడీని అరికట్టేందుకు మేధావులు టీడీపీతో కలిసి రావాలన్నారు.
తెలంగాణకు ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. ఆ పార్టీ
అధినేత్రి సోనియాను విమర్శించకుండా టీడీపీపై విమర్శలుచేస్తే తెలంగాణ ఎలా
వస్తుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జేఏసీ తరపున అమరవీరుల
వారసులను ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు.